సాధారణ స్థాయి నుంచి రాష్ట్ర గవర్నర్ స్థాయికి ఎదిగిన మహోన్నతుడు కొణిజేటి రోశయ్య అని, ఆయన జీవితం అందరికి ఆదర్శప్రాయమని కొవ్వూరు ఆర్య వైశ్య సంఘం అధ్యక్షులు మట్టే ప్రసాద్ అన్నారు. ఆర్య వైశ్య సంఘం ఆధ్వర్యంలో కొణిజేటి రోశయ్య 3వ వర్ధంతిని బుధవారం నిర్వహించారు. ఆర్యవైశ్య సంఘ సభ్యులు రోశయ్య విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. కొవ్వూరు పట్టణ ఆర్యవైశ్య సంఘం సభ్యులు పాల్గొన్నారు.