యూపీలోని మహారాజ్‌గంజ్‌లో కొందరు యువకులు చిరుతపులిని చేతులతో పట్టుకున్న వీడియో నెట్టింట వైరలవుతోంది. యూపీలోని ఓ గ్రామంలో ఇద్దరు వ్యక్తులు పొలాల్లో పని చేస్తుండగా వారిపై చిరుతపులి దాడి చేసింది.
ప్రాణాలను కాపాడుకునేందుకు వారు నదిలోకి దూకారు. వారిని వెంబడిస్తూ చిరుత కూడా నదిలోకి దూకింది. దీన్ని గమనించిన కొందరు యువకులు నదిలో చిరుతను ఒట్టి చేతులతో పట్టుకున్నారు. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరలవుతోంది.