విశాఖపట్నం సెంట్రల్ జైల్లో పార్శిల్ కలకలం రేపింది. ఖైదీల బ్యారక్‌ల సమీపంలో ఉన్న పూలకుండీల మధ్యలో పార్శిల్ బయటపడింది. అది ఓపెన్ చూసి చూస్తే అసలు సంగతి తెలిసింది. జైల్లోని పెన్నా బ్యారక్ సమీపంలో పూల కుండీల దగ్గర అధికారులు అనుమానం ఏదో కనిపించింది. వెంటనే అక్కడికి వెళ్లి చూశారు.. ఓ పార్శిల్ కనిపించింది. ముందు అది గంజాయి అనుకున్నారు.. కానీ ఓపెన్ చేసి చూస్తే అందులో మొబైల్స్, బ్యాటరీ, ఓ పవర్ బ్యాంకు, ఛార్జింగ్ కేబుల్‌ను గుర్తించారు. ఈ పార్శిల్‌ను పూలకుండీల దగ్గర గొయ్యి తీసి అందులో కవర్ పార్శిల్ పెట్టి పూడ్చారు.. రెండు రాళ్లు పైన కప్పేసినట్లు జైలు అధికారులు తెలిపారు.
ఈ విషయాన్ని అక్కడి సిబ్బంది జైళ్లశాఖ ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లారు.. అనంతరం ఆరిలోవ పోలీస్ స్టేషన్‌లో కూడా ఫిర్యాదు చేశారు. ఈ క్రమంలో విశాఖపట్నం పోలీస్ కమిషనర్ శంఖబ్రత బాగ్చీ రంగంలోకి దిగారు.. ఈ అంశంపై ఆరా తీశారు. అయితే జైల్లో దొరికిన మొబైల్స్‌లో సిమ్‌కార్డులు లేవు.. ఆ సిమ్‌లను ఎక్కడ దాచారోనని ఆరా తీస్తున్నారు. ఆ సిమ్స్ బయటపడితే ఈ మొబైల్స్ నుంచి ఎవరితో మాట్లాడారో తేలిపోతుందంటున్నారు. ఈ మొబైల్స్ దొరికిన పూలకుండీలకు దగ్గరలో ఉన్న బ్యారక్‌లో రౌడీషీటర్ కోలా హేమంత్ కుమార్ ఖైదీగా ఉన్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో ఆయన్ను కూడా ప్రశ్నించే అవకాశం ఉందంటున్నారు.
హేమంత్‌కుమార్ విశాఖపట్నం మాజీ ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ కుటుంబ సభ్యుల కిడ్నాప్ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్నారు. అలాగే మిగిలిన ఖైదీలను ప్రశ్నించనున్నారు అధికారులు. ఓ హత్య కేసులో శిక్ష అనుభవిస్తున్నట్లు సమాచారం. జైల్‌లోని బ్యారక్ సమీపంలో మొబైల్స్ దొరకడం సంచలనంగా మారింది. ఈ మొబైల్స్ ఘటనకు ఈ నెల 28న జైల్లో జరిగిన ఘటనకు లింక్ ఉందనే కోణంలో కూడా దర్యాప్తు చేస్తున్నారు.అలాగే ఇటీవల 37మంది వార్డర్లను జైలు అధికారులు బదిలీ చేసిన సంగతి తెలిసిందే. అంతేకాదు కొద్ది రోజుల క్రితం ఓ ఫార్మసిస్ట్ క్యారేజ్ బాక్సులో గంజాయి తీసుకొస్తూ దొరికిపోయాడు. అప్పటి నుంచి సెక్యూరిటీ సిబ్బంది క్యారేజీ బాక్సుల్ని లోపలికి అనుమతించడం లేదని చెబుతున్నారు. ఇప్పుడు ఏకంగా మొబైల్స్ బయటపడటం కలకలం రేపుతోంది. అసలు జైలు లోపలికి మొబైల్స్ ఎలా వచ్చాయని అధికారులు సీరియస్‌గా తీసుకున్నారు. జైలు సిబ్బంది సహకారం ఉందా అనే కోణంల ోకూడా ఆరా తీస్తున్నట్లు సమాచారం. విశాఖపట్నం జైల్లో వరుస ఘటనలు ఇప్పుడు చర్చనీయాంశంగా మారాయి. ఈ మొబైల్స్ దొరికిన అంశంపై జైళ్లశాఖ ఉన్నతాధికారులు స్పందించాల్సి ఉgది.