TDP సభ్యత్వ నమోదులో డ్రామా నడుస్తోందని మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ ఎద్దేవా చేశారు. ఆయన విశాఖలో మీడియాతో మాట్లాడుతూ..‘TDP సభ్యత్వ నమోదుపై లోకేష్ తప్పుడు ప్రచారం చేస్తున్నారు.
భీమిలి నియోజకవర్గంలోని ముచ్చర్ల గ్రామంలో సభ్యత్వంపై తప్పుడు ప్రచారం జరుగుతోంది. పట్టాలు, ఆధార్ కార్డులు ఇప్పిస్తామంటూ అడ్రస్‌లు తీసుకుని TDP సభ్యత్వమంటూ ప్రచారం చేసుకుంటున్నారు. ’ అని కామెంట్స్ చేశారు.