గ్రామీణాభివృద్ధిలో భాగంగా కేంద్ర ప్రభుత్వం ద్వారా అమలు చేస్తున్న ఉపాధి హామీ పథకాన్ని మరింత ఉపయుక్తంగా ఉండేలా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. పథకం అమలులో కీలకమైన గ్రామస్థాయిలోని ఫీల్డ్ అసిస్టెంట్లను మరింత క్రియాశీలకంగా పనిచేయించాలని నిర్ణయించింది. రానున్న ఆరు మాసాలకు వారికి నిర్థిష్ట లక్ష్యాలను ఇవ్వనుంది. అందులో ఒక్కొక్కరి పనితీరును బేరీజు వేసి భవిష్యత్‌లో కొనసాగించడమా? తొలగించడమా? అన్నది నిర్ణయించనుంది. అదేసమయంలో గ్రామాలలో ఉపాధి కూలీలతో ఉన్న శ్రమశక్తి సంఘాలను పునర్‌వ్యవస్థీకరించి మేస్త్రీల వ్యవస్థను బలోపేతం చేయనుంది. ఆమేరకు ఇటీవల అన్ని జిల్లాల డ్వామా ప్రాజెక్టు డైరెక్టర్లతో గ్రామాభివృద్ధి శాఖ కమిషనర్ కృష్ణతేజ నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో స్పష్టత ఇచ్చారు.