ఢిల్లీలో మరోసారి అధికారంలోకి రాగానే మంచినీటి బిల్లులను మాఫీ చేస్తామని ఆమ్ ఆద్మీ పార్టీ కన్వీనర్ కేజ్రీవాల్ హామీ ఇచ్చారు. తాను జైల్లో ఉన్నప్పుడు ప్రజలకు తప్పుడు నీటిబిల్లులు ఇచ్చారని ఆయన ఆరోపించారు.
ఆ నీటిబిల్లును చూసి ప్రజలు ఆందోళన చెందుతున్నారన్నారు. ఎవరి బిల్లు అయితే తప్పుగా వచ్చిందని భావిస్తున్నారో.. వారు నీటిబిల్లులు కట్టాల్సిన అవసరం లేదు అని తేల్చి చెప్పారు.