రతన్ టాటా మానవతావాది అని ఉండి ఎమ్మెల్యే రఘురామ కృష్ణంరాజు తెలిపారు. లక్షలాదిమందికి ఉపాధి కల్పించిన మహా పారిశ్రామిక వేత్త అని చెప్పారు. సంక్రాంతి పండుగలోపు రతన్ టాటా విగ్రహావిష్కరణ చేయాలని భావించామన్నారు. ఎంత ఎదిగినా ఒదిగి ఉండాలనే తత్వం రతన్ టాటాది అని చెప్పారు. గ్రామాల అభివృద్ధిలో స్థానికుల సహకారం అవసరమని ఎమ్మెల్యే రఘురామ కృష్ణంరాజు అన్నారు.ఉండి నియోజకవర్గ పరిధిలోని పెదఅయినంలో రతన్‌టాటా కాంస్య విగ్రహం ఆవిష్కరించారు.