దేశ అభివృద్ధికి గ్రామాలే పట్టుకొమ్మలని.. అటువంటి గ్రామాల అభివృద్ధిని గత ప్రభుత్వాలు విస్మరించాయని ప్రధాని నరేంద్రమోదీ అన్నారు. ఢిల్లీలో నిర్వహించిన ‘గ్రామీణ భారత మహోత్సవం 2025’ కార్యక్రమంలో ఆయన పాల్గొని ప్రసంగించారు.
మారుమూల గ్రామాల ప్రజలను దేశ అభివృద్ధిలో భాగం చేయడమే లక్ష్యంగా తమ ప్రభుత్వం కృషి చేస్తోందని తెలిపారు. గ్రామీణ ఆర్థికవ్యవస్థను బలోపేతం చేయడానికి సమ్మిళిత ఆర్థిక విధానాలు అవసరమని పేర్కొన్నారు.