విద్యార్థుల్లో సృజనాత్మతను వెలికి తీసేందుకు సైన్స్ ఎగ్జిబిషన్లు దోహదపడతాయని శ్రీకాకుళం ఎమ్మెల్యే గొండు శంకర్ అన్నారు. గుజరాతీపేటలోని ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాలలో శుక్రవారం జరిగిన జిల్లాస్థాయి సైన్స్ ఎగ్జిబిషన్‌లో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కూటమి ప్రభుత్వం విద్యకు పెద్దపీట వేస్తుందన్నారు. విద్య కోసం ప్రభుత్వం ఎన్నో పథకాలను ప్రవేశపెడుతుందన్నారు. ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలల్లో చదివే విద్యార్థులకు పుస్తకాలు, బ్యాగ్ లు, యూనిఫారాలు అందిస్తుందని గుర్తుచేశారు. మం డల, జిల్లా, రాష్ట్రస్థాయిలో సైన్స్ ఎగ్జిబిషన్ నిర్వహించడం గొప్ప విషయమ న్నారు. కార్యక్రమంలో డీఈవో ఎస్.తిరుమల చైతన్య, ఏపీసీ శశిభూషణ్‌రావు, డిప్యూటీ డీఈ వోలు ఆర్.విజయకుమారి, విలియమ్స్, జిల్లా సైన్స్ అధికారి కుమారస్వామి తదితరులు పాల్గొన్నారు. జాయింట్ కలెక్టర్ ఫర్మాన్ అహ్మద్ ఖాన్ సందర్శించి ప్రాజెక్టులను పరిశీలించారు.