పులివెందుల మరికొన్ని చోట్ల జగన్ ప్రజల నుంచి అర్జీలు తీసుకొంటున్నారు. తీసుకొని ఏం చేస్తారు? వాటిపై అసెంబ్లీలో మాట్లాడతారా? సమాధానం చెప్పాలి’ అని టీడీపీ ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు ప్రశ్నించారు. రాష్ట్రంలో ప్రభుత్వం మారగానే వాట్సాప్ కాల్స్ నుంచి మామూలు ఫోన్లు మాట్లాడుకొనే పరిస్థితికి ప్రజలు వచ్చారని, జగన్ హయాంలో ప్రజలు ఎంత స్వేచ్ఛను ప్రజలు కోల్పోయారో ఇదే నిదర్శనమని వ్యాఖ్యానించారు. ఆరు నెలల పాలనలో ఎవరేం చేశారో ప్రజల ముందు చర్చించడానికి దమ్ముంటే వైసీపీ నేతలు బహిరంగ చర్చకు రావాలని యార్లగడ్డ సవాల్ విసిరారు.