ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు గతరాత్రి దావోస్ నుంచి ఢిల్లీ చేరుకున్న సంగతి తెలిసిందే. ఇవాళ ఢిల్లీలో ఆయన కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్, భారత మాజీ రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ లను కలిశారు. విశాఖ ఉక్కు పరిశ్రమకు స్పెషల్ ప్యాకేజి ప్రకటించడం పట్ల నిర్మలా సీతారామన్ కు చంద్రబాబు కృతజ్ఞతలు తెలియజేశారు. 2025-26 కేంద్ర బడ్జెట్లో ఏపీకి ప్రాధాన్యం ఇవ్వాలని ఆమెకు విజ్ఞప్తి చేశారు. కాగా, దావోస్ లో సీఎం చంద్రబాబు పర్యటన నాలుగు రోజుల పాటు సాగింది. దిగ్గజ సంస్థల సీఈవోలు, చైర్మన్లతో భేటీ అయిన చంద్రబాబు... ఏపీకి భారీ పెట్టుబడులు రాబట్టడంలో సఫలమయ్యారని టీడీపీ వర్గాలు హర్షం వ్యక్తం చేస్తున్నాయి. అటు, మంత్రి లోకేశ్ ఇవాళ దావోస్ నుంచి తిరుగుపయనమయ్యారు.