వచ్చే వారంలో కొత్త ఐటీ బిల్లు ప్రవేశ పెట్టనున్నట్లు కేంద్ర ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్ వెల్లడించారు. వచ్చే వారంలో కొత్త ఆదాయపు పన్ను చట్టాన్ని తీసుకొస్తున్నట్టు కేంద్ర మంత్రి తెలిపారు.
మారిటైమ్ డెవలప్‌మెంట్ ఫండ్‌కు రూ.25 వేల కోట్లు కేటాయించారు. బీమా రంగంలో ఎఫ్‌డీఐ 100 శాతానికి పెంచుతున్నట్లు తెలిపారు. ప్రస్తుతం ఉన్న 74 శాతం నుంచి నూరు శాతానికి పెంచుతున్నట్లు నిర్మలా ప్రకటించారు.