పల్నాడు జిల్లా సత్తెనపల్లి రైల్వేస్టేషన్ సమీపంలో అమానుష ఘటన చోటు చేసుకుంది. వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉందని, కన్న కూతురినే ఓ మహాతల్లి చిత్రహింసలకు గురి చేసింది. తల్లి అనే పదమే సిగ్గపడేలా దారుణంగా ప్రవర్తించింది. ఐదు రోజులుగా బాలికకు అన్నం పెట్టకుండా అట్లకాడతో కాల్చివాతలు పెట్టింది ఆ మహా ఇళ్లాలు. చిత్రహింతలకు గురై తీవ్రగాయాలతో అన్నం లేకుండా చిన్నారి పడి ఉండడాన్ని చూసిన స్థానికులు చలించిపోయారు. సదరు మహిళపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అనంతరం 1098కి ఫిర్యాదు చేశారు. సమాచారం అందుకున్న ఐసీడీఎస్ అధికారులు, పోలీసులు బాలిక ఇంటికి చేరుకున్నారు. అయితే వారి రాకను గమనించి పాపను దాచి పెట్టే ప్రయత్నం చేసింది ఆ తల్లి. బాలిక జాడను కనిపెట్టిన అధికారులు తల్లిని, ఆమెకు సహకరించిన మరో మహిళను స్టేషన్కు తరలించారు. బాలికను శిశుసంక్షేమ గృహనికి చేర్చారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.