మోదీ మార్క్‌తో కూడిన బడ్జెట్ ఇదని ఇరవై సూత్రాల కార్యక్రమాల అమలు చైర్మన్ లంకా దినకర్ తెలిపారు. పేద, మహిళ, మధ్య తరగతి సంక్షేమం కోసం ఈ బడ్జెట్‌లో పెద్దపీట వేశారని చెప్పారు. ఇది వికసిత భారత్ మోదీ 3.0 బడ్జెట్ అన్నారు. వ్యక్తిగత ఆదాయం పన్ను రూ.12 లక్షల వరకు మినహాయింపు, ఉద్యోగులకు రూ.75 వేలు స్టాండర్డ్ డిడక్షన్ కలుపుకొరూ.12.75 లక్షల వరకు పన్ను మినహాయింపు ఇస్తున్నట్లు చెప్పారు.
రెండు స్వయం నివాస గృహాలు వరకు ఆదాయపన్ను మినహాయింపు ఉంటుందన్నారు.36 రకాల లైఫ్ సేవింగ్ డ్రగ్స్ పైన డ్యూటీ మినహాయింపు ఇవ్వడం మంచి నిర్ణయమని అన్నారు. మధ్యతరగతి వర్గాల వస్తూ, సేవల వినియోగం వృద్ధి రేటు పెరిగే అవకాశం ఉందని చెప్పారు. ఈ బడ్జెట్ అంత్యోదయ స్ఫూర్తితో రూపొందించిన వికసిత భారత్ బడ్జెట్ అని వివరించారు. 8 వ సారి బడ్జెట్ ప్రవేశపెట్టిన వ్యక్తిగా నిర్మల సీతారామన్ రికార్డ్ సృష్టించారని అన్నారు. రూ.10.18 లక్షల కోట్ల మూలధన వ్యయంతో ఉత్పాదక ఆస్తుల కల్పనకు ఊతం ఇస్తుందని తెలిపారు.