కేంద్ర వార్షిక బడ్జెట్ (2025-26)ను ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ శనివారం ప్రకటించారు . మొత్తం రూ.50,65,345 కోట్లతో ప్రవేశపెట్టారు. శాఖల వారీగా చూసుకుంటే.. రక్షణ శాఖకు ఏకంగా రూ.4.91 లక్షల కోట్లు కేటాయించారు. ఆ తర్వాత గ్రామీణ శాఖకు రూ.2.66 లక్షల కోట్లు కేటాయించారు. బడ్జెట్‌లో ఆంధ్రప్రదేశ్ మీద కేంద్రప్రభుత్వం వరాల జల్లు కురిపించింది. ఏపీకి ప్రత్యేకంగా కేటాయింపులు చేసింది. పోలవరం ప్రాజెక్టుకు గతేడాది కంటే రూ.400 కోట్లు కేటాయించ్చింది. మొత్తంగా రూ.5,936 కోట్లు ఇస్తున్నట్లు బడ్జెట్‌లో పేర్కొంది. విశాఖపట్నం పోర్టుకు కూడా గతేడాదితో పోలిస్తే రూ.445 కోట్లు అధికంగా ఇస్తున్నట్లు ప్రకటించింది. మొత్తంగా విశాఖ పోర్టుకు రూ.730 కోట్లు కేటాయించింది.
అయితే ఏపీకి బడ్జెట్‌లో ప్రాధాన్యం ఇవ్వడంపై కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు స్పందించారు.ప్రజల తరఫున నిర్మల సీతారామన్‌కు కృతజతలు తెలిపారు. లాజిస్టిక్ హబ్‌గా ఏపీని అభివృద్ధి చేస్తామని అన్నారు. జల్ జీవన్ మిషన్‌లో భాగంగా ప్రతి ఇంటికీ తారునీరు అందిచాలన్నది ప్రధానమంత్రి నరేంద్రమోదీ కల అని తెలిపారు. 2028 వరకు జల్ జీవన్ మిషన్ పొడిగింపుతో ఏపీకి ఎంతో మేలు చేకూరుతుందని అన్నారు. డబుల్ ఇంజిన్ సర్కార్ ఫలితాలు ఎలా ఉంటాయో ప్రజలు చూస్తున్నారని రామ్మోహన్‌నాయుడు అన్నారు.