భూముల విలువ పెరగడం రిజిస్ర్టేషన్ శాఖకు కలిసొచ్చింది. జనవరి నెలలో లక్ష్యాలను సాధించలేకపోవడంతో తలపట్టుకున్న రిజిస్ట్రేష న్ శాఖ అధికారులకు నెలాఖరు రెండు రోజుల ఆదాయం కాస్త ఊరట కలి గించింది. శనివారం నుంచి పెంచిన భూముల విలు వను ప్రభుత్వం అమల్లోకి తీసుకురావడంతో గురు, శుక్రవారాలు(గత నెల 30,31) రిజస్ట్రేషను కార్యాలయాలు జాతరను తలపించాయి. సాధారణంగా కొనుగోలు చేయడానికి మంగళ వా రం, విక్రయించడానికి శుక్ర వారం వెనకడుగు వేస్తుం టారు.కానీ భూముల విలువ పెరిగితే రిజిస్ట్రేషను రుసుం తదితర ఖర్చులు కూడా పెరుగుతా యి.
అందువల్ల శుక్రవారం సెంటిమెంటును సైతం పక్కన పెట్టి కక్షిదారులు రిజిస్ట్రారు కార్యాల యాలకు క్యూ కట్టారు.ఆ ఒక్క రోజున జిల్లాలో రికార్డు స్థాయిలో 834 రిజిస్ట్రేషన్లు జరి గాయి. సర్వర్లు మొరాయించినా క్రయవిక్రయ దారులు మాత్రం ఓపిగ్గా రిజిస్ట్రేషను ప్రక్రియ పూర్తి చేశారు.మొత్తానికి జిల్లాలోని 12 సబ్ రిజిస్ట్రారు కార్యాలయాల ద్వారా రెండు రోజుల్లో 1536 రిజిస్ట్రేషన్లు జరగ్గా రూ.13 కోట్ల 41 లక్షల 73 వేల ఆదాయం ప్రభుత్వ ఖజానాకు జమ అయ్యింది. రాజానగరం, పిడింగొయ్యి, రాజమ హేంద్రవరం మొదటి మూడు స్థా నాల్లో నిలిచాయి. ఎనీవేర్ రిజిస్ట్రేషను(కార్డ్ ప్రైమ్ 2.0)లో అప్రూవల్ కాల పరిమితిని కూట మి ప్రభుత్వం 48 గంటలకు పొడి గించడం వల్ల రిజిస్ట్రేషన్ల సంఖ్యలో తగ్గుదల కనిపిస్తోందని ఓ సబ్ రిజిస్ట్రారు అభిప్రాయం వ్యక్తం చేశారు.గతంలో ఆ సమయం గంట మాత్రమే ఉండేది.ఈ జనవరి నుంచి ఆ సమయాన్ని 48 గంట లకు పెంచడంతో అప్రూ వల్ రావడం ఆలస్యం అవుతోంది.దీంతో కక్షిదారులు ఇబ్బంది పడుతున్నారు.