మత్తు పదార్థాలకు నో చెబుదాం అని కడప ఫ్యాక్షన జోన ఇన్సపెక్టర్ రమణారెడ్డి సూచించారు. ఎస్పీ ఈజీ అశోక్‌కుమార్ ఆదేశాల మేరకు కడప నగరంలోని శ్రీహరి డిగ్రీకళాశాలలో శనివారం యాంటి డ్రగ్స్ అవేర్నెస్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సమాజంలో యు వత మత్తుకు అలవాటుపడి బంగారు భవిష్యత్తును నాశనం చేసుకోవద్దన్నారు. తల్లిదండ్రులు తమ పిల్లలు ఉన్నతమైన స్థాయిలో ఉంటారని కలలు కంటారని, కలలను బుగ్గిపాలు చేయవద్దన్నారు.
పలువురు మత్తు ప దార్థాలకు అలవాటుపడి డబ్బు కోసం నేరాలకు పాల్పడుతూ మంచి భవిష్యత్తును కో ల్పోతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. ఎ వరైనా గంజాయి విక్రయిస్తున్నారని తెలి స్తే వెంటనే పోలీసులకు సమాచారం అందించాలన్నారు. సమాజాన్ని కాపాడాల్సిన యు వతీయువకులు తమ బంగారు భవిష్యత్తుకు పునాదులు వేసుకోవాలని సూచించారు. ప్రా ణాంతకమైన మత్తు పదార్థాలు, మాదక ద్రవ్యాలకు నో చెప్పి తల్లిదండ్రుల కలలను నిజం చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో అధ్యాపకులు, విద్యార్థులు, పోలీసు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.