ప్రతి నెల ఒకటో తేదీ ఎన్టీఆర్ భరోసా పింఛన్ అందజేసి పేదల కళ్ళల్లో ఆనందం చూడటమే ముఖ్యమంత్రి చంద్రబాబు ధ్యేయయని, పేదల సంక్షేమానికి ఆయన కృషి చేస్తున్నారని శ్రీశైలం ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖరరెడ్డి అన్నారు. శనివారం బండిఆత్మకూరులో ఎంపీడీవో దస్తగిరి, ఏపీఎం రాజశేఖర్ రెడ్డితో కలిసి లబ్ధిదారులకు పింఛన్ అందజేశారు. టీజీపీ చైర్మన్ కంచర్ల మనోహర్‌చౌదరి, శ్రీశైలం ట్రస్టుబోర్డు మాజీ సభ్యుడు డాక్టర్ చిట్టిబొట్ల భరద్వాజశర్మ, టీడీపీ మండల అఽధ్యక్షుడు నరసింహారెడి,్డ బైరెడ్డి సుబ్బారెడ్డి, లక్ష్మిరెడ్డి, జాకీర్‌ఖాన్, బుగ్గరాముడు, సర్పంచ్ రామచంద్రుడు, రామసుబ్బయ్య, బాబు, ఈశ్వర్‌రెడ్డి, శంకర్‌రెడ్డి, సాయిబాబారెడ్డి, మదనభూపాల్, బాలుడు, చలమయ్య, అబీద్, అంజాద్ పాల్గొన్నారు.