కేంద్ర బడ్జెట్లో అన్ని వర్గాలకు సమ ప్రాధాన్యం ఇచ్చారని మంత్రి బీసీ జనార్దన్‌రెడ్డి అన్నారు. కేంద్ర బడ్జెట్‌పై మంత్రి మాట్లాడుతూ రూ.12 లక్షల వరకు ఆదాయ పన్ను మినహాయింపు ఇవ్వడం మధ్యతరగతి ప్రజలకు, ఉద్యోగులకు గొప్ప ఊరట అన్నారు. ఇది మధ్య తరగతి కొనుగోలు శక్తి పెరిగి ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేస్తోందని తెలిపారు.
కిసాన్ క్రెడిట్ కార్డుల పరిమితి రూ.5 లక్షలకు పెంచడం ద్వారా కేంద్రంలోని కూటమి ప్రభుత్వం రైతులకు ఇస్తున్న ప్రాధాన్యత అర్థమవుతోందన్నారు. పోలవరకు ప్రాజెక్టుకు 5,936 కోట్లు, పోలవరం నిర్మాణానికి బ్యాలెన్సు గ్రాంట్ రూ.12,157 కోట్లు, విశాఖ స్టీల్‌ప్లాంట్‌కు రూ.3295 కోట్లు కేటాయించి ఏపీకి కేంద్రం ప్రాధాన్యత ఇచ్చిందని తెలిపారు. విశాఖ పోర్టుకు రూ.730 కోట్లు, ఏపీలో రోడ్లు, వంతెల నిర్మాణానికి రూ.240 కోట్లు, ప్రధాని మోదీ, ఆర్థిక మంత్రి కేటాయించడం హర్షించదగ్గ విషయమని అన్నారు.