చైనాపై సుంకాలు విధించాలన్న అమెరికా అధ్యక్షుడి డోనాల్డ్ ట్రంప్ నిర్ణయంపై చైనా వాణిజ్య మంత్రిత్వ శాఖ తీవ్రంగా మండిపడింది. ప్రపంచ వాణిజ్య సంస్థ (డబ్ల్యూటీవో)లో వాషింగ్టన్ నిర్ణయాన్ని సవాలు చేస్తామని ఆ శాఖ ఆదివారం ప్రకటించింది. కెనడా, మెక్సికోపై 25 శాతం, చైనాపై 10 శాతం సుంకాలు విధిస్తూ ట్రంప్ శనివారం నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. ఈ సుంకాలు మంగళవారం నుంచి అమల్లోకి రానున్నాయి.