రాష్ట్రంలో ప్రతినెలా పెన్షన్ల పంపిణీ కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు ఒక పబ్లిసిటీ ఈవెంట్‌లా నిర్వహిస్తున్నారని వైయస్‌ఆర్‌సీపీ అధికార ప్రతినిధి, మాజీ ఎమ్మెల్సీ జూపూడి ప్రభాకర్‌రావు మండిపడ్డారు. తాడేపల్లి వైయస్‌ఆర్‌సీపీ కేంద్ర కార్యాలయంలో మంగళవారం మీడియాతో మాట్లాడుతూ ముఖ్యమంత్రి హోదాలో ఉండి నిస్సిగ్గుగా అదే పనిగా అబద్ధాలు చెప్పడం ఒక్క చంద్రబాబుకు మాత్రమే సాధ్యమని అన్నారు. అప్పులపైనా, మెగా డీఎస్సీపైనా, స్టీల్‌ప్లాంట్‌పైనా చంద్రబాబు చెప్పిన, మాట్లాడిన అబద్ధాలు చూస్తే ఆశ్చర్యం కలుగుతోందని జూపూడి అన్నారు.అయన మాట్లాడుతూ.... సీఎం చంద్రబాబు ఈనెల పెన్షన్ల కార్యక్రమాన్ని పర్చూరు నియోజకవర్గంలోని ఒక ఇంట్లో ప్రారంభించారు. నెలనెలా ఏదో ఒక ఊరికి వెళ్ళడం.. పెన్షన్లు పంచుతూ సుదీర్ఘ ఉపన్యాసం ఇవ్వడం చంద్రబాబుకు అలవాటు. ఒక కుటుంబానికి ఇల్లు కట్టిస్తారు. ఒకరికి ఆటో కొనిపెడతారు. వాటిని చూపుతూ రాష్ట్రం అంతా అలాగే ఇస్తున్నామని గొప్పగా ప్రచారం చేసుకోవడం ఒక్క చంద్రబాబుకే సాధ్యమవుతుంది. తన వల్లే మొత్తం రాష్ట్రంలోనే పేదల జీవితాలు బాగుపడిపోతున్నాయన్నట్లుగా బిల్డప్ ఇస్తారు. ఈరోజు చంద్రబాబు దాదాపు గంటన్నర ప్రసంగంలో అన్నీ అబద్ధాలు, తనను తాను పొగుడుకోవడమే. జగన్‌గారిని ఉద్దేశించి మాట్లాడుతూ, గత 5 ఏళ్లలో బటన్ నొక్కుడు కన్నా, తాను పంపిణీ చేస్తున్న పెన్షన్లు ఎక్కువంటూ చులకన చేశారు. ‘అయ్యా, చంద్రబాబుగారూ, తన 5 ఏళ్ల పాలనలో జగన్‌గారు బటన్ నొక్కి అంటే, డీబీటీ ద్వారా నేరుగా పేదల ఖాతాలకు జమ చేసిన మొత్తం అక్షరాలా రూ.2.72 లక్షల కోట్లు. కానీ, ఆయన ఏనాడూ మీ మాదిరిగా ఇలా పబ్లిసిటీ ఈవెంట్స్ నిర్వహించలేదు. ప్రచార ఆర్భాటం అంతకన్నా చేసుకోలేదు. ప్రతి ఇంటికి తెల్లవారుజామునే వెళ్ళి వృద్దులకు పెన్షన్‌ను అందించే గొప్ప వ్యవస్థను ఏర్పాటు చేశారు. కూటమి ప్రభుత్వం రాగానే ఆ వ్యవస్థనూ నీరుగార్చారు. అయినా మీరు, పెన్షన్ల పంపిణీ ఈవెంట్‌ను, డీబీటీతో ఎలా పోలుస్తున్నారో అర్థం కావడం లేదు’ అని అన్నారు.
![]() |
![]() |