వక్ఫ్ చట్ట సవరణ బిల్లుకు ఎన్డీయే భాగస్వామ్య పక్షమైన టీడీపీ మద్దతు ప్రకటించింది. రేపు లోక్ సభకు తప్పనిసరిగా హాజరుకావాలని, సభలోనే ఉండాలని తమ ఎంపీలందరికీ టీడీపీ విప్ జారీ చేసింది. టీడీపీ చీఫ్ విప్ హరీశ్ బాలయోగి 3 లైన్ల విప్ జారీ చేశారు. వక్ఫ్ చట్ట సవరణ బిల్లు రేపు పార్లమెంటు ముందుకు వస్తున్న నేపథ్యంలో టీడీపీ నాయకత్వం ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. మోదీ నాయకత్వంలోని ఎన్డీయే సర్కారు ఈ బిల్లును నేడు లోక్ సభలో ప్రవేశపెట్టనుంది. వక్ఫ్ చట్ట సవరణ బిల్లుపై ఎల్లుండి రాజ్యసభలో చర్చ జరగనుంది. ఈ కీలక బిల్లుపై ఉభయ సభల్లో చర్చకు 8 గంటల సమయం కేటాయించారు. అటు బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు కూడా రేపు, ఎల్లుండి తప్పనిసరిగా పార్లమెంటుకు హాజరు కావాలని తమ ఎంపీలకు విప్ జారీ చేశాయి.
![]() |
![]() |