మేఘాలయ ప్రిన్సిపల్ సెక్రటరీ సయ్యద్ మహ్మద్ రజీ అనుమానాస్పదంగా మృతి చెందారు. మహ్మద్ రజీ ఏప్రిల్ 4న మధ్య ఆసియా దేశ పర్యటనకు వెళ్లారు. ఈ క్రమంలో మంగళవారం ఉజ్బెకిస్థాన్‌లోని తన హోటల్ గదిలో అనుమానాస్పద స్థితిలో మృతి చెంది కనిపించారు. గుండెపోటుతో మరణించినట్లు అక్కడి పోలీసులు అనుమానం వ్యక్తం చేశారు. కాగా ఈయన 2021 నుంచి మేఘాలయ ప్రిన్సిపల్ సెక్రటరీగా విధులు నిర్వహిస్తున్నారు.సోమవారం ఉదయం రాజీ కాల్స్‌కు స్పందించలేదని ఒక సీనియర్ ప్రభుత్వ అధికారి తెలిపారు. ఆ తర్వాత, హోటల్ సిబ్బంది అతని గది తలుపులు పగలగొట్టి చూశారు
![]() |
![]() |