ట్రెండింగ్
Epaper    English    தமிழ்

నష్టాలతో ప్రారంభమై...లాభాలతో ముగిశాయి

business |  Suryaa Desk  | Published : Tue, Apr 26, 2022, 10:00 PM

ఈ రోజు దేశీయ స్టాక్ మార్కెట్ కు మంచి రోజులొచ్చాయి. దేశీయ స్టాక్ మార్కెట్లు ఈరోజు దూసుకుపోయాయి. గత రెండు సెషన్లుగా నష్టపోయిన మార్కెట్లు ఈరోజు భారీ లాభాల్లో ముగిశాయి. అంతర్జాతీయంగా నెలకొన్న సానుకూలతలు ఇన్వెస్టర్ల సెంటిమెంటును బలపరిచాయి. ఈ నేపథ్యంలో, ఈరోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 777 పాయింట్లు లాభపడి 57,357కి చేరుకుంది. నిఫ్టీ 247 పాయింట్లు లాభపడి 17,201కి ఎగబాకింది. ఈరోజు అన్ని సూచీలు లాభాల్లో ముగిశాయి.   


బీఎస్ఈ సెన్సెక్స్ టాప్ గెయినర్స్:


పవర్ గ్రిడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (3.39%), టైటాన్ (3.92%), మహీంద్రా అండ్ మహీంద్రా (3.85%), ఇండస్ ఇండ్ బ్యాంక్ (3.54%), బజాజ్ ఫైనాన్స్ (3.31%). 


టాప్ లూజర్స్:


యాక్సిస్ బ్యాంక్ (-0.70%), ఏసియన్ పెయింట్స్ (-0.15%), మారుతి (-0.12%), టీసీఎస్ (-0.09%).






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa