ముసునూరు మండల పరిషత్ సర్వసర సమావేశానికి సభ్యులందరూ హాజరు కావడంపై శుక్రవారం వైస్ ఎంపీపీ కోటగిరి రాజా నాయనా అసహనం వ్యక్తం చేశారు. ప్రజా సమస్యల పరిష్కారానికి ఎంపీటీసీలు సర్పంచులు అందరూ కృషి చేయాలని ఆయన ఆకాంక్షించారు. వస్తేనే గ్రామాల్లో అభివృద్ధి పనులు పై చర్చించుకునేందుకు అవకాశం కలుగుతుందని ఆయన అభిప్రాయపడ్డారు. నిధులు కోసమే ఆ సర్వసభ్య సమావేశానికి రాకూడదని, ప్రజా సమస్యల పరిష్కారానికి కూడా ఈ సమావేశంలో చర్చించడం జరుగుతుందని ఆయన చెప్పారు. ఎంపీపీ రాపర్ల కృష్ణ కుమార్ అధ్యక్షతన ఈ సమావేశం జరిగింది. ఆయా శాఖల అధికారులు ఎంపీటీసీ సభ్యులు సర్పంచ్లు కొద్ది మంది మాత్రమే హాజరయ్యారు. తహసిల్దార్ సుధ, ఏం డి వో జి రాణి, జడ్పిటిసి సభ్యులు ప్రతాప్ తదితరులు పాల్గొన్నారు.