చౌక విమానయాన సంస్థ ‘గో ఫస్ట్’ తన కార్యకలాపాలను పూర్తిగా నిలిపివేసి, దివాలా పిటిషన్ను దాఖలు చేసింది. మే 28 వరకు తమ సేవలను రద్దుచేస్తున్నట్టు ప్రకటించటంతో బాటు ప్రయాణికులకు కలిగిన అసౌకర్యానికి విచారం వ్యక్తం చేసింది. ముందే టిక్కెట్లు బుక్ చేసుకున్న వారికి రిఫండ్ చేస్తామని హామీఇచ్చింది. అయితే.. నెలరోజుల్లో గో ఫస్ట్ తన పునరుద్ధరణ ప్రణాళికను సమర్పించాలని DGCA ఆదేశించింది.