ఐపీల్ స్పాట్ ఫిక్సింగ్ కేసులో ఆయనపై బీసీసీఐ విధించిన జీవితకాల నిషేధాన్ని సుప్రీంకోర్టు ఎత్తివేసింది. ఈ విషయమై క్రికెటర్ శ్రీశాంత్ స్పందించాడు. తనకు సుప్రీంకోర్టు ఓ లైఫ్ లైన్ ఇచ్చిందని వ్యాఖ్యానించాడు. త్వరలోనే భారత జట్టులో చోటు దక్కించుకుంటానని ఆశాభావం వ్యక్తం చేశాడు. ఇందుకోసం తాను ఆరేళ్లు ఆగాననీ శ్రీకాంత్ చెప్పుకొచ్చాడు. 90 రోజులు పూర్తయ్యేవరకూ ఆగకుండా ఈ విషయంలో బీసీసీఐ క్రమశిక్షణ కమిటీ త్వరగా నిర్ణయం తీసుకోవాలని విజ్ఞప్తి చేశాడు. త్వరలో జరిగే స్కాటిష్ లీగ్ తో పాటు క్లబ్ క్రికెట్ ఆడాలనుకుంటున్నట్లు వ్యాఖ్యానించాడు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa