ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ముగిసిన నామినేషన్ల గడువు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Mon, Mar 25, 2019, 04:04 PM

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో నామినేషన్ల దాఖలు పర్వం ముగిసింది. మార్చి 25 తుదిగడువు కావడంతో ఆఖరిరోజున కూడా గణనీయంగా నామినేషన్లు దాఖలయ్యాయి. కాగా, రేపటి నుంచి నామినేషన్ల పరిశీలన జరపనున్నారు. మార్చి 28 వరకు నామినేషన్ల ఉపసంహరణకు అవకాశం ఉంటుంది. ఆంధ్రప్రదేశ్ లో 175 అసెంబ్లీ స్థానాలకు, 25 లోక్ సభ స్థానాలకు, తెలంగాణలో 17 లోక్ సభ స్థానాలకు నామినేషన్ల దాఖలు చేశారు. ఏప్రిల్ 11న తొలి విడత పోలింగ్ జరగనున్న సంగతి తెలిసిందే.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa