తెలంగాణ సీఎం కేసీఆర్, వైసీపీ అధినేత జగన్ పై టీడీపీ అధికార ప్రతినిధి లంకా దినకర్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. అమరావతిలో ఈరోజు నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, కేసీఆర్ భావాలకు తగ్గట్టుగానే జగన్ వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. పోలవరం ప్రాజెక్టు పూర్తయితే ముంపునకు గురవుతామని భద్రాచలం ప్రాంతంలోని కొందరు రైతులకు భయం పట్టుకుందని జగన్ పత్రికలో ప్రచురించడంలో అర్థమేంటని ప్రశ్నించారు. పోలవరం ప్రాజెక్టు పూర్తయితే ఏపీలోని కోట్లాది మంది రైతులకు, రాయలసీమ రైతులకూ లబ్ధి కలుగుతుందని అన్నారు. కేసీఆర్ ఇచ్చే వెయ్యి కోట్ల రూపాయల కోసం, ఏపీలోని రైతుల నోట్లో మట్టి కొట్టాలని జగన్ చూస్తున్నారని ఆరోపించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa