ట్రెండింగ్
Epaper    English    தமிழ்

వడదెబ్బ నివారణకు ఆరోగ్య కేంద్రంలో అవగాహన కార్యక్రమం

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Fri, Apr 17, 2026, 12:28 PM

పొన్నూరు మండలం శలపాడు గ్రామంలోని ఆరోగ్య కేంద్రంలో శుక్రవారం ఎండకాలంలో వడదెబ్బ బారిన పడకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అవగాహన కార్యక్రమం జరిగింది. కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్ కొడాలి సృజన మాట్లాడుతూ ఎక్కువగా నీరు, మజ్జిగ, కొబ్బరి నీళ్లు వంటి ద్రవ పదార్థాలు తీసుకోవాలని, మధ్యాహ్నం ఎండలో బయటకు వెళ్లవద్దని, టోపీ, గొడుగు వాడాలని, వృద్ధులు, పిల్లలపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఏఎన్ఎం లావణ్య, శివపార్వతి, ఆశా కార్యకర్తలు, గ్రామస్తులు పాల్గొన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa