ఢిల్లీ-మేరఠ్ ఎక్స్‌ప్రెస్‌వేపై శుక్రవారం తెల్లవారుజామున విషాదం చోటుచేసుకుంది. హైవే పక్కన ఆగి ఉన్న ఒక థార్ కారు, బైక్ సమీపంలో నిలబడి ఉన్న ముగ్గురు యువకులను, అతివేగంతో వచ్చిన టెంపో బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ముగ్గురు యువకులు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం తరలించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa