బ్రహ్మోత్సవాలను పురస్కరించుకొని ఈనెల 30 న శ్రీవారికి సీఎం జగన్మోహన్‌రెడ్డి పట్టువస్త్రాలు సమర్పిస్తారు. సోమవారం మఽధ్యాహ్నం 3గంటలకు ప్రత్యేక విమానంలో గన్నవరం ఎయిర్‌పోర్టు నుంచి తిరుపతికి చేరుకుంటారు. సాయంత్రం 4.15గంటలకు ‘అలిపిరి- చెర్లోపల్లి’ జంక్షన్‌లో నాలుగులైన్ల రోడ్డు నిర్మాణానికి శంకుస్థాపన చేస్తారు. 5.15గంటలకు తిరుమలలో మాతృశ్రీ వకుళాదేవి యాత్రికుల వసతి సముదాయానికి శంకుస్థాపన చేసి, పద్మావతి అతిథిగృహానికి చేరుకుంటారు. రాత్రి 7గంటలకు ప్రభుత్వం తరఫున శ్రీవారికి పట్టువస్త్రాలు సమర్పించి పెద్దశేష వాహన సేవలో పాల్గొంటారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa