మార్గదర్శకాలను పాటించడంలో విఫలం ఆర్థిక వివరాల ఆడిట్ రిపోర్టులను సమర్పించడంలో ఇనిస్టిట్యూట్ ఆఫ్ చార్టెడ్ అకౌంట్స్ ఆఫ్ ఇండియా మార్గదర్శకాలను పూర్తిగా పాటించడంలో రాజకీయ పార్టీలు విఫలం అయ్యాయని ఏడీఆర్ వ్యాఖ్యానించింది. ముఖ్యంగా రుణాలు ఎక్కడి నుంచి తీసుకుంటున్నారు? ఏ బ్యాంకులలో డిపాజిట్లు ఉన్నాయి లాంటి వివరాలు నివేదికల్లో సమర్పించడంలేదని పేర్కొంది. మరోవైపు రుణాలు ఎవరికి ఇస్తున్నారో కూడా కొన్ని పార్టీలు వెల్లడించడంలేదని ఏడీఆర్ పేర్కొంది. పెట్టుబడుల విషయంలోనూ పారదర్శకత పాటించడంలేదని ఏడీఆర్ వివరించింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa