సినిమాలంటేనే మాయా ప్రపంచం. అందులో తెరచాటు అంశాలు అన్నీ ఇన్నీ కావు. అలాంటి కథే ఇది ఒకటి. నిర్మాతగా, నటుడిగా గుర్తింపు తెచ్చుకుంటున్న యువకుడు హీరోగా స్టార్ డమ్ తెచ్చుకోవాలని అనేక ప్రయత్నాలు చేస్తున్నాడు. ఇప్పటికే మిషన్ 2023 సినిమాను నిర్మించడమే కాకుండా ఆ సినిమాలో హీరోగా నటించాడు. సొంతంగా సినిమాలు తీస్తున్న నటిస్తున్న ఆ నిర్మాత, నటుడు ఓ నటిని పరిచయం చేసుకున్నాడు. నేను నిన్ను ప్రేమిస్తున్నానని, పెళ్లి చేసుకుంటానని, నా సర్వస్వం నువ్వే అంటూ ఆ నటుడు సాటి నటికి తియ్యటి మాటలు చెప్పాడని ఆరోపణలు ఉన్నాయి. గత కొంతకాలంగా ఆ నిర్మాత, ఆ నటి కలిసి తిరుగతున్నారని తెలిసింది. అయితే తనను పెళ్లి చేసుకుంటానని తనతో రెండు సంవత్సరాల నుంచి శారీరక సంబంధం పెట్టుకున్నాడని, ఇప్పుడు పెళ్లి చేసుకోమంటే ఎదురుతిరుగుతున్నాడని ఆ నటి పోలీసులను ఆశ్రయించింది. నేను నిన్ను పెళ్లి చేసుకోను, నీకు దిక్కున్న చోట చెప్పుకో, ఎక్కువ మాట్లాడితే చంపేస్తానని బెదిరిస్తున్నాడని ఆ నటి పోలీసు కేసు పెట్టింది. తన మీద అత్యాచారం చెయ్యడమే కాకుండా చంపేస్తానని బెదిరిస్తున్నాడని ఆ నటి కేసు పెట్టడంతో నటుడు, నిర్మాతను అరెస్టు చేసిన పోలీసులు అతన్ని అరెస్టు చేసి సెంట్రల్ జైలుకు పంపించడం కలకలం రేపింది. బెంగళూరులో ప్రముఖ కన్నడ నిర్మాత, నటుడు టీజీ. హర్షవర్దన్ అలియాస్ విజయ్ బార్గవ్ నివాసం ఉంటున్నాడు. నిర్మాతగా, నటుడిగా గుర్తింపు తెచ్చుకుంటున్న హర్షవర్దన్ హీరోగా స్టార్ డమ్ తెచ్చుకోవాలని అనేక ప్రయత్నాలు చేస్తున్నాడు. ఇప్పటికే మిషన్ 2023 సినిమాను నిర్మించడమే కాకుండా ఆ సినిమాలో హర్షవర్దన్ హీరోగా నటించాడు. సొంతంగా సినిమాలు తీస్తున్న నటిస్తున్న నిర్మాత, నటుడు హర్షవర్దన్ ఓ నటిని పరిచయం చేసుకున్నాడు. ఆమె కూడా హర్షవర్దన్ నటిస్తూ నిర్మించిన మిషన్ 2023 సినిమాలో నటించింది. నేను నిన్ను ప్రేమిస్తున్నానని, పెళ్లి చేసుకుంటానని, నా సర్వస్వం నువ్వే అంటూ నటుడు, నిర్మాత హర్షవర్దన్ సాటి నటికి తియ్యటి మాటలు చెప్పాడని ఆరోపణలు ఉన్నాయి. చాలా కాలంగా నిర్మాత హర్షవర్దన్ ఆ నటి కలిసి తిరుగతున్నారని తెలిసింది. కొంతకాలం నుంచి నిర్మాత హర్షవర్దన్, ఆ నటి మధ్య బిభేదాలు వచ్చాయని తెలిసింది. తనను పెళ్లి చేసుకుంటానని తనతో రెండు సంవత్సరాల నుంచి శారీరక సంబంధం పెట్టుకున్నాడని, ఇప్పుడు పెళ్లి చేసుకోమంటే నిర్మాత హర్షవర్దన్ ఎదురుతిరుగుతున్నాడని ఆ నటి బెంగళూరులోని అన్నపూర్ణేశ్వరిన గర పోలీసులను ఆశ్రయించింది. నేను నిన్ను పెళ్లి చేసుకోను, నీకు దిక్కున్న చోట చెప్పుకో, ఎక్కువ మాట్లాడితే చంపేస్తానని నిర్మాత హర్షవర్దన్ బెదిరిస్తున్నాడని ఆ నటి పోలీసు కేసు పెట్టింది. తన మీద అత్యాచారం చెయ్యడమే కాకుండా తనను చంపేస్తానని బెదిరిస్తున్నాడని ఆ నటి కేసు పెట్టడంతో నటుడు, నిర్మాత హర్షవర్దన్ ను అరెస్టు చేసిన బెంగళూరు పోలీసులు అతన్ని పరప్పన అగ్రహార సెంట్రల్ జైలుకు పంపించడం కలకలం రేపింది. ఇటీవల ఓ యువతి ఇదే టైపులో కేసు పెట్టడంతో బెంగళూరులోని సుబ్రమణ్యపుర పోలీసులు కన్నడ నటుడు శేషగిరి బసవరాజ్ ను అరెస్టు చేసి పరప్పన అగ్రహార సెంట్రల్ జైలుకు పంపించిన విషయం తెలిసిందే. పలు కేసుల్లో స్యాండిల్ వుడ్ కు చెందిన ఎవరో ఒకరు అరెస్టు కావడంతో సాటి నటీనటలు విచారం వ్యక్తం చేస్తున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa