స్టాక్ మార్కెట్ దలిద్రుడిని కోటీశ్వరుడిని చేస్తుంది. కోటీశ్వరుడిని రోడ్డుపైకి కూడా తెచ్చేస్తోంది. స్టాక్ మార్కెట్ లో పెట్టుబడి పెట్టాలంటే అందుకు మన వద్ద కాస్త ఓపిక సహనం అవసరమని ఆర్థిక నిపుణులు పేర్కొంటున్నారు. స్టాక్ మార్కెట్‌లో డబ్బులు పెట్టే వారికి ఓపిక ఉండాలి. సహనంతో దీర్ఘకాలం వరకు వేచి ఉండాలి. అప్పుడు మంచి రాబడి సొంతం చేసుకోవచ్చు. దీర్ఘకాలం పాటు ఇన్వెస్ట్‌మెంట్లను కొనసాగించలేని వారు స్టాక్ మార్కెట్‌లో ఇన్వెస్ట్ చేయకపోవడం ఉత్తమం. ఓపికతో ఎలాంటి రాబడి పొందొచ్చొ ఈ షేరును గమనిస్తే అర్థం అవుతుంది. స్మార్ట్ ఇన్వెస్టర్‌గా మారాలంటే మీరు సహనంతో ఉండటం నేర్చుకోవాలి. మార్కెట్‌లో చాలా షేర్లు ఉన్నాయి. వీటిల్లో పలు రకాల షేర్లు ఇన్వెస్టర్లకు భారీ లాభాలు అందించి ఉంటాయి. ఇలాంటి వాటిల్లో రాజ్‌రతన్ గ్లోబల్ వైర్ కూడా ఒకటి. ఈ షేరు గత ఏడేళ్ల కాలంలో కళ్లుచెదిరే రాబడిని ఇచ్చింది. ఏకంగా 6600 శాతం ర్యాలీ చేసింది. దీంతో ఈ షేరు కొన్న వారి పంట పండిందని చెప్పుకోవచ్చు. 2015 జనవరి 30న ఈ షేరు రూ.39.11 వద్ద ఉండేది. కానీ ఇప్పుడు షేరు ధర ఏకంగా రూ.2620కు స్థాయికి పరుగులు పెట్టింది. గత నెల రోజుల కాలంలో షేరు ధర రూ.2027 నుంచి రూ.2620కు చేరింది. అంటే దాదాపు 30 శాతం రాబడిని ఇచ్చింది. అదే ఆరు నెలల కాలంలో చూస్తే.. ఈ షేరు ధర రూ.2252 నుంచి రూ.2620కు ఎగసింది. అంటే దాదాపు 16 శాతం రాబడిని ఇచ్చింది. ఇక గత ఏడాది కాలంలో షేరు ధర 375 శాతం పరుగులు పెట్టింది. అలాగే గత ఐదేళ్లల కాలంలో షేరు ధర రూ.263 నుంచి రూ.2620కు ర్యాలీ చేసింది. అంటే దాదాపు 900 శాతం పరుగులు పెట్టింది. ఇంకా ఏడేళ్ల కాలంలో చూస్తే.. షేరు ధర రూ.39 నుంచి రూ.2620కు ఎగసింది. అంటే 6600 శాతం పైకి కదిలింది. అంటే మీరు ఏడేళ్ల కిందట ఈ షేరులో రూ.లక్ష పెట్టి ఉంటే ఇప్పుడు ఇన్వెస్ట్‌మెంట్ విలువ రూ.67 లక్షలు అయ్యేది. అదే ఐదేళ్ల కిందట ఈ షేరులో రూ.లక్ష ఇన్వెస్ట్ చేసి ఉంటే.. ఇప్పుడు ఇన్వెస్ట్‌మెంట్ విలువ రూ.10 లక్షలకు పెరిగేది. అదే ఏడాది కిందట రూ.లక్ష పెట్టి ఉంటే.. ఇప్పుడు రూ.4.75 లక్షలు పొందే వారు. కాగా ఈ కంపెనీ మార్కెట్ క్యాప్ రూ.2660 కోట్లుగా ఉంది. షేరు 52 వారాల గరిష్ట స్థాయి రూ.3055. అలాగే కనిష్ట స్థాయి రూ.500గా నమోదు అయ్యింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa