ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఫ్లిప్‌కార్ట్ ఎలక్ట్రానిక్స్ సేల్...వినియోగదార్లకు బంపర్ ఆపర్స్

national |  Suryaa Desk  | Published : Sun, Jan 30, 2022, 02:07 AM

ఫ్లిప్‌కార్ట్ ఎలక్ట్రానిక్స్ సేల్ నిర్వహిస్తూ తన వినియోగదార్లకు బంపర్ ఆపర్లు ఇస్తోంది. దిగ్గజ ఈకామర్స్ సంస్థ ఫ్లిప్‌కార్ట్‌లో వివిధ రకాల ఆఫర్లు అందుబాటులో ఉన్నాయి. ఫ్లిప్‌కార్ట్ ఎలక్ట్రానిక్స్ సేల్ నిర్వహిస్తోంది. బ్లాక్‌బస్టర్ డీల్స్ సొంతం చేసుకోవచ్చు. ఈ సేల్ జనవరి 31 వరకు అందుబాటులో ఉంటుంది. ఫ్లిప్‌కార్ట్ బ్లాక్‌బస్టర్ డీల్స్‌లో భాగంగా మీరు పలు రకాల ప్రయోజనాలు పొందొచ్చు. యాక్సి్స్ బ్యాంక్, సిటీ బ్యాంక్ క్రెడిట్ కార్డు, డెబిట్ కార్డుపై రూ.1500 వరకు తగ్గింపు సొంతం చేసుకోవచ్చు. కనీస ట్రాన్సాక్షన్ వ్యాల్యూ రూ.5 వేలు లేదా ఆపైన ఉండాలి. అలాగే ఫ్లిప్‌కార్ట్ యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డు ద్వారా టీవీలు కొంటే 5 శాతం అపరిమిత క్యాష్‌బ్యాక్ లభిస్తుంది. అంతేకాకుండా ఈఎంఐ ఆప్షన్‌లో కూడా మీరు టీవీలు కొనుగోలు చేయొచ్చు. అయితే మీ వద్ద క్రెడిట్ కార్డు ఉండాలి. క్రెడిట్ ద్వారా ఈఎంఐ రూపంలో టీవీలు కొనుగోలు చేస్తే ప్రతి నెలా తక్కువ మొత్తంతో టీవీ పొందొచ్చు. మీరు ఎంచుకునే టీవీ, మీరు ఉపయోగించే క్రెడిట్ కార్డు, లోన్ టెన్యూర్ వంటి వాటి ప్రాతిపదికన మీరు చెల్లించాల్సిన ఈఎంఐ కూడా మారుతుంది. మీరు కోడక్ 7ఎక్స్ ప్రో సరీస్ 32 అంగుళాల హెచ్‌డీ రెడీ ఎల్‌ఈడీ స్మార్ట్ ఆండ్రాయిడ్ టీవీ కొనుగోలు చేయాలని భావిస్తే.. ఈ టీవీ ధర ప్రస్తుతం ఫ్లిప్‌కార్ట్‌లో రూ.12,499గా ఉంది. మీ వద్ద ఎస్‌బీఐ క్రెడిట్ కార్డు ఉంటే.. దీని ద్వారా టీవీని కొంటే 12 నెలల ఈఎంఐ పెట్టుకోవచ్చు. అప్పుడు నెలకు రూ.1123 పడుతుంది. అదే ఆర్‌బీఎల్ క్రెడిట్ కార్డు ద్వారా కొంటే.. మీకు 24 నెలల వరకు ఈఎంఐ ఆప్షన్ లభిస్తోంది. అంటే నెలకు రూ.607 పడుతుంది. స్టాండర్డ్ చార్టర్డ్ బ్యాంక్, కోటక్ మహీంద్రా బ్యాంక్, ఐసీఐసీఐ బ్యాంక్, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, అమెరికన్ ఎక్స్‌ప్రెస్ ఇలా మీరు ఏ క్రెడిట్ కార్డు ద్వారా అయినా టీవీని కొనుగోలు చేస్తే 24 నెలల వరకు ఈఎంఐ ఆప్షన్ లభిస్తోంది. అదే ఫ్లిప్‌కార్ట్ యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డు ఉంటే 36 నెలల ఈఎంఐ పెట్టుకోవచ్చు. నెలకు రూ.430 పడుతుంది. అంతేకాకుండా ఈ టీవీపై ఎక్స్చేంజ్ ఆఫర్ కూడా ఒకటుంది. మీరు ఎక్స్చేంజ్‌లో టీవీ కొంటే రూ.11 వేల వరకు తగ్గింపు పొందొచ్చని ఫ్లిప్‌కార్ట్ పేర్కొంటోంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa