ట్రెండింగ్
Epaper    English    தமிழ்

షేర్ మార్కెట్ లో దూసుకెళ్తున్న ఐషర్ మోటార్స్ కంపెనీ

national |  Suryaa Desk  | Published : Sun, Jan 30, 2022, 02:06 AM

షేర్ మార్కెట్ అంటనే కిస్మత్ కా ఖేల్ అంటారు. అందుకే మనం వేల రూపాయలు పెట్టినా ఏకంగా లక్షలు వస్తాయి. ఇలాంటివి కేవలం స్టాక్ మార్కెట్‌లోనే జరుగుతూ ఉంటాయి. అందుకే చాలా మంది షేర్ మార్కెట్‌లో ఇన్వెస్ట్ చేస్తూ ఉంటారు. అయితే మార్కెట్‌లో భారీ రిస్క్ కూడా ఉంటుందని గమనించాలి. లేదంటే పెట్టిన డబ్బులు కూడా వెనక్కి రావు. అందుకే షేర్ మార్కెట్‌లోకి అడుగు పెట్టేవారు చాలా జాగ్రత్తగా ఉండాలి. అన్ని విషయాలు తెలుసుకోవాలి. ఐషర్ మోటార్స్ కంపెనీ ఇన్వెస్టర్లకు ధనవంతులను చేసింది. కంపెనీ షేరు బలమైన రాబడిని అందించింది. దీంతో ఇన్వెస్టర్ల తల రాత మారిపోయింది. ఈ కంపెనీ షేరు గత 20 ఏళ్ల కాలంలో ఏకంగా 80 వేల శాతం రాబడిని అందించింది. గత పదేళ్ల కాలంలో కంపెనీ షేరు 1500 శాతం ర్యాలీ చేసింది. ఇన్వెస్టర్లు 20 ఏళ్ల కిందట రూ.10 వేలు ఇన్వెస్ట్ చేసినా ఇప్పుడు అది రూ.లక్షలుగా మారేది. 2002 జనవరి 25న బీఎస్ఈలో ఐషర్ మోటార్స్ షేరు ధర కేవలం రూ.3.17 మాత్రమే. ఇప్పుడు కంపెనీ షేరు రూ.2600కు పైమాటే. అంటేకంపెనీ షేరు ఏకంగా 82 వేలకు పైగా రాబడిని అందించింది. ఎవరైనా ఈ షేరులో 2002 జనవరి 25న రూ.10 వేలు ఇన్వెస్ట్ చేసి ఉంటే.. ఇప్పుడు ఆ ఇన్వెస్ట్‌మెంట్ విలువ ఏకంగా రూ.81 లక్షలకు పెరిగి ఉండేది. అంటే ఎంత లాభం వచ్చిందో అర్థం చేసుకోవచ్చు. అదే రూ.లక్ష ఇన్వెస్ట్ చేసి ఉంటే.. మిలియనీర్లు అయిపోయి ఉంటే వారు. రూ.కోట్ల మేర లాభం వచ్చి ఉండేది. 2002 జనవరి 25న ఈ షేరులో రూ.లక్ష ఇన్వెస్ట్ చేసి ఉంటే.. ఇప్పుడు ఈ డబ్బుల విలువ ఏకంగా రూ.8.2 కోట్లకు చేరేది. కళ్లుచెదిరే ప్రాఫిట్ అంటే ఇదే. కాగా షేరు ధర 52 వారాల గరిష్ట స్థాయి రూ. 3,018గా ఉంది. 52 వారాల కనిష్ట స్థాయి రూ.2303గా ఉంది. ఇదిలావుంటే ఐషర్ మోటార్స్.. రాయల్ ఎన్‌ఫీల్డ్ బైక్స్ తయారు చేస్తుంది. బుల్లెట్ బైక్ కూడా ఈ కంపెనీదే.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa