ట్రెండింగ్
Epaper    English    தமிழ்

‘ఇద్దరి లోకం ఒకటే’ మూవీ రిలీజ్ డేట్ ఫిక్స్?

cinema |  Suryaa Desk  | Published : Wed, Oct 23, 2019, 05:03 PM

యంగ్ హీరో రాజ్‌ తరుణ్‌ హీరోగా ప్రముఖ నిర్మాత దిల్ రాజు నిర్మాణంలో తెరకెక్కుతున్న చిత్రం ‘ఇద్దరి లోకం ఒకటే’. జి.ఆర్‌.కృష్ణ దర్శకత్వంలో రాబోతున్న ఈ సినిమా తాజాగా రిలీజ్ డేట్ ను ఫిక్స్ చేసుకుంది. న‌వంబ‌ర్ 9న ఈ సినిమా విడుద‌ల కానుందని ద‌ర్శ‌క నిర్మాత‌లు అధికారికంగా పోస్టర్ ద్వారా ప్రకటించారు. ఇక ఈ సినిమాలో రాజ్ తరుణ్ సరసన షాలినీ పాండే హీరోయిన్ గా నటిస్తోంది. అయితే రాజ్ తరుణ్ కు హిట్ వచ్చి చాలా కాలమే అయిపోయింది. గత ఏడాది మూడు చిత్రాలతో ప్రేక్షకుల ముందుకొచ్చినా.. ఒక్క సినిమాతో కూడా ఆకట్టుకోలేకపోయాడు ఈ యంగ్ హీరో. మరి ఈ సినిమాతోనైనా రాజా తరుణ్ కి షాలినీ పాండేకు మంచి హిట్ వస్తోందేమో చూడాలి. మిక్కీ జె.మేయ‌ర్ సంగీతం అందిస్తోన్న ఈ చిత్రానికి స‌మీర్ రెడ్డి సినిమాటోగ్ర‌ఫీ అందిస్తున్నారు. రాజ్ తరుణ్ ప్రస్తుతం ‘గుండె జారి గ‌ల్లంత‌య్యిందే’ ఫేమ్ కొండా విజయ్ కుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘ఒరేయ్.. బుజ్జిగా’ సినిమాలో నటిస్తున్నాడు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa