కరోనా ప్రభావం టాలీవుడ్ పై పడింది. రెగ్యులర్ గా బ్యాంకాక్.. థాయ్ ల్యాండ్ సహా పలు ఎగ్జోటిక్ లొకేషన్లకు టూర్లు వెళ్లే సెలబ్రిటీలంతా ఇప్పుడు అప్రమత్తమయిపోయారట. ప్రతిసారీ స్క్రిప్టు రాసేందుకు బ్యాంకాక్ – థాయ్ ల్యాండ్ కి వెళ్లే పూరి జగన్నాథ్ లాంటి టాప్ డైరెక్టర్ సైతం గోవాతో సరిపెట్టుకుంటున్నారట. అలాగే థాయ్ ల్యాండ్ లోని అడవుల్లో షూటింగ్ కోసం ప్రిపరేషన్స్ చేసుకున్న బన్ని- సుకుమార్ టీమ్ పైనా ఈ ప్రభావం ఉందా అనేది తెలియాల్సి ఉంది. మరోవైపు ఇప్పటికే ఎగ్జోటిక్ డెస్టినేషన్ ట్రిప్స్ ప్లాన్ చేసుకున్న పలువురు టాలీవుడ్ టాప్ సెలబ్రిటీలు విమానం టిక్కెట్లు క్యాన్సిల్ చేసుకునే పనిలో ఉన్నారట. ఒకే ఒక్క దెబ్బకు సెలబ్రిటీలంతా ఒణికిపోతున్నారు. కరోనా కల్లోలం ఏ రేంజులో ఉందో విశ్లేషించేందుకు ఇంతకంటే ఏం కావాలి.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa