ట్రెండింగ్
Epaper    English    தமிழ்

నయన్ పై ఫైర్ అవుతున్న నిర్మాతలు!

cinema |  Suryaa Desk  | Published : Sun, Feb 02, 2020, 06:34 PM

నయనతార పారితోషకం విషయంలో ఎలాంటి పట్టు విడుపు ఉండదు. అయితే అది నిర్మాతలకు కూడా ఓకె. కానీ నయనతార తన పర్సనల్ స్టాఫ్ కి కూడా నిర్మాతల నుండే డబ్బు పిండుతుంది అని... నిర్మాతలిచ్చే స్వేచ్చని నయన్ దుర్వినియోగం చేస్తుంది అంటూ ఓ నిర్మాత ఆరోపించడం కోలీవుడ్, టాలీవుడ్ లో చర్చనీయాంశమైంది. నయనతార పర్సనల్ డ్రైవర్ దగ్గరనుండి, ఆమె మేకప్ మ్యాన్ వరకు, ఇంకా నయనతార పర్సనల్ వ్యవహారాలు చూసుకునే స్టాఫ్ కి కూడా ఆ నిర్మాతలే డబ్బు ఇవ్వాలట. ఆఖరుకి కార్ డీజిల్ బిల్ కూడా నిర్మాత ఎకౌంట్ లోనే పడుతుంది. నయనతార పారితోషకం ఆరేడు కోట్లు ఉంటే.. ఆమె పర్సనల్ ఖర్చులే 50 లక్షల వరకు ఉంటుంది అని ఆ నిర్మాత బహిరంగంగా నయనతారని విమర్శిస్తున్నాడు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa