మూన్ వాక్ ఎంటర్టైన్మెంట్ పతాకం పై సందీప్ చేగురి నిర్మిస్తూ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం ‘ఒక చిన్న విరామం’. సంజయ్ వర్మ , గరీమ సింగ్ హీరో హీరోయిన్లుగా పరిచయమవుతున్నారు, బిగ్ బాస్ కంటెస్టెంట్ పునర్నవి భూపాళం, నవీన్ నేని ముఖ్య పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రం థ్రిల్లర్ కథాంశంతో ఉత్కంఠగా సాగుతుంది. ఒక మంచి సందేశం ఉన్న ఈ చిత్రం అందరూ కొత్త కళాకారులతో తెరకెక్కబడింది. రోడ్ ప్రయాణంలో సాగే కథ ఇది, డిఫరెంట్ కాన్సెప్ట్ తో ఈ సినిమా ఫిబ్రవరి 14న విడుదల కానుంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa