బాలీవుడ్ నటి కంగనా రనౌత్ ఇటీవల మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేసి తీవ్ర విమర్శలను ఎదుర్కొంటోంది. 1947లో మనకు లభించింది నిజమైన స్వాతంత్ర్యం కాదని.. అది మనకు వేసిన భిక్ష అని అంతేకాకున్న జాతీ పీత మహాత్మ గాంధీ పై కూడా సంచలన వ్యాఖ్యలు చేసింది. 'ఒక చెంప మీద కొడితే రెండో చెంప చూపించాలి` అంటూ మహాత్మా గాంధీ చెప్పిన సూత్రాన్ని ఎద్దేవా చేస్తూ ఆమె వ్యాఖ్యలు చేశారు. ఆమె ఆ తీవ్ర వ్యాఖ్యల తో ఇపుడు ఇబ్బంద్దులో పడింది. అయితే ఈ వ్వ్యాక్యలపై మహాత్ముడి ముని మనవడు తుషార్ దీటుగా బదులిచ్చారు. 'గాంధేయవాదులు మరో చెంప మాత్రమే చూపిస్తారని కొందరు ఆరోపిస్తున్నారు. కానీ, అలా రెండో చెంప చూపించాలంటే ఎంత ధైర్యం అవసరమో ఆ పిరికి వ్యక్తులకు అర్థం కాదు.
వారు ఆ వీరత్వాన్ని అర్థం చేసుకోలేని అసమర్థులు. ఆనాటి భారతీయులు అలాంటి ధైర్యాన్ని సమృద్ధిగా ప్రదర్శించారు. వారంతా హీరోలు. తన దేశం, ప్రజల కోసం ఆయన ఇవన్నీ పట్టించుకోలేదు.అర్ధ నగ్న ఫకీరు అంటూ బ్రిటీష్ ప్రధాని కొట్టిపారేసినా.. చివరకు ఆ దేశం గాంధీ ఎదుట లొంగిపోవాల్సి వచ్చింది. అబద్ధాలను ఎంత బిగ్గరగా అరిచి చెప్పినా.. నిజం నిలకడగా ఉంటుంది. అయితే, ఈ అబద్ధాలపై స్పందించాల్సి ఉంది` అని తుషార్ తెలిపారు. ఇక ఇలాంటి వ్యాఖ్యలువై చేసిన ఆమెపై దేశద్రోహం కేసు నమోదు చేయాలని కాంగ్రెస్ అధికార ప్రతినిధి గౌరవ్ వల్లభ్ డిమాండ్ చేశారు. కంగనపై దేశద్రోహం కేసు నమోదు చేయాలని ముంబై పోలీసులను ఆప్ నాయకురాలు ప్రీతి శర్మ కోరారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa