తెలుగులో సూపర్ హిట్ అయిన క్షణం సినిమాకి రీమేక్ గా తెరకెక్కిన చిత్రం బాఘీ 2. అహ్మద్ ఖాన్ డైరెక్షన్ లో తెరకెక్కిన ఈ చిత్రం మార్చి 30న విడుదలైంది. టైగర్ ష్రాఫ్, దిశాపటానీ ప్రధాన పాత్రలలో రూపొందుతున్న ఈ చిత్రాన్ని నడియావాలా గ్రాండ్ సన్ ఎంటర్ టైన్ మెంట్ ప్రైవేట్ లిమిటెడ్ నిర్మించింది. విడుదలైన తొలి రోజు నుండే ఈ మూవీ బాక్సాఫీస్ దగ్గర ప్రభంజనం సృష్టిస్తుంది. తొలి వారంలో 100 కోట్ల వసూళ్ళు రాబట్టిన భాఘి 2మూవీ ప్రస్తుతం 200 కోట్ల క్లబ్‌లో చేరినట్టు తెలుస్తుంది. ఇండియాలోనే కాక ఓవర్సీస్‌లోను ఈ మూవీకి మంచి ఆదరణ లభిస్తుంది. ఇండియాలో 148.45 కోట్ల వసూళ్ళు రాబట్టిన బాఘీ2, ఓవర్సీస్‌లో 41.76 కోట్లు సంపాదించింది. ప్రపంచ వ్యాప్తంగా ఈ మూవీ 200 కోట్ల రూపాయలు సాధించిందని తరణ్ ఆదర్శ్ తన ట్వీట్ ద్వారా తెలిపారు. ఈ ఏడాది పద్మావతి చిత్రం 500 కోట్ల వసూళ్ళు సాధించి తొలి స్థానంలో నిలవగా, 200 కోట్ల కలెక్షన్స్‌తో బాఘీ2 రెండో స్థానంలో నిలిచింది. ఈ చిత్రానికి జూలియస్ పాకియం సంగీతం అందించారు. ఇది కూడా సినిమాకి చాలా ప్లస్ అయింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa