హైదరాబాదులోని కూకట్ పల్లి హౌసింగ్ బోర్డు కాలనీలో అర్జున్ రెడ్డి ఫేమ్ షాలినీ పాండే హల్ చల్ చేసింది. ఒక టీవీ ఛానెల్ లో మంచు లక్ష్మి వ్యాఖ్యాతగా 'మేము సైతం' కార్యక్రమం ప్రసారమవుతున్న సంగతి తెలిసిందే. ఈ కార్యక్రమంలో షాలినీ పాండే పాల్గొంది. ఈ కార్యక్రమం ద్వారా ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న వారిని సినీ నటులు ఆదుకుంటున్న సంగతి తెలిసిందే. అలాగే ఇబ్బందుల్లో ఉన్న వారిని ఆదుకునేందుకు షాలినీ పాండే ముందుకు వచ్చింది. ఈ నేపథ్యంలో షాలినీ పాండే కేపీహెచ్బీలో కూరగాయలమ్మింది. ఈ సందర్భంగా పలువురు అభిమానులతో ఫోటోలు దిగింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa