స్టార్ కపుల్ కత్రినా కైఫ్ మరియు విక్కీ కౌశల్ పెళ్లి గురించి ఎన్నో వార్తలు ప్రచురితం అవుతున్నాయి. అయితే ఈ రోజు వీరిద్దరూ పెళ్లి చేసుకోనున్నారు.
సన్నిహిత వర్గాల సమాచారం ప్రకారం, ఈ జంట తమ కుటుంబాలు మరియు స్నేహితుల సమక్షంలో రాజస్థాన్ లోని సవాయ్ మాధోపూర్ బర్వారా కోటను పెళ్లికి సిద్ధం చేసారని సమాచారం. ప్రీ-వెడ్డింగ్ ఉత్సవాలు డిసెంబర్ 7న మెహందీతో ప్రారంభమయ్యాయి, ఆ తర్వాత డిసెంబర్ 8న పెద్ద ఫ్యాట్ పంజాబీ సంగీత్ నైట్ జరిగింది. తాజాగా, పెళ్లి కూతురు కత్రినా కైఫ్ చీరకట్టులో చిరునవ్వులు చిందిస్తూ ఫొటో దిగింది. ఇప్పుడు ఆ ఫోటో వైరల్ గా మారింది.
ఈ వేడుకకు కబీర్ ఖాన్, అంగద్ బేడీ, మినీ మాథుర్, నేహా ధూపియా, గురుదాస్ మాన్, శర్వరీ వాఘ్, మరియు విజయ్ కృష్ణ ఆచార్య వంటి చిత్ర పరిశ్రమకు చెందిన పలువురు విక్కీ మరియు కత్రినాల వివాహ వేడుకల్లో పాల్గొన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa