ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఇంట్రెస్టింగ్ గా ఉన్న ''గమనం'' మూవీ ట్రైలర్

cinema |  Suryaa Desk  | Published : Thu, Dec 09, 2021, 09:08 PM

ఆసక్తికరమైన కథాంశంతో తెరకెక్కిన, ఎమోషనల్ ఫ్యామిలీ డ్రామా ''గమనం''. ఈ మూవీ ట్రైలర్ ను ఈ రోజు  విడుదల అయింది. సీనియర్ హీరోయిన్ శ్రియా శరణ్ ప్రధాన పాత్రలో యువ హీరో శివ కందుకూరి - ప్రియాంక జవాల్కర్ - చారు హసన్ - నిత్యా మీనన్ ఇందులో కీలక పాత్రలలో ఈ  ''గమనం'' మూవీ లో నటించారు. ఎలాంటి డైలాగ్స్ లేకుండా కేవలం బ్యాగ్రౌండ్ స్కోర్ తోనే సాగిన 'గమనం' రిలీజ్ ట్రైలర్ ఆకట్టుకుంటోంది. ప్రతి ఒక్కరినీ భావోద్వేగానికి గురిచేసే సున్నితమైన కథాంశంతో ఈ సినిమా రూపొందినట్లు తెలుస్తోంది. ఇందులో భర్తకు దూరమైన వినికిడి లోపం ఉన్న సాధారణ గృహిణిగా శ్రియా కనిపించనుంది. ఇండియన్ క్రికెట్ టీమ్ కి ఆడాలని కలలు కనే కుర్రాడిగా శివ కందుకూరి.. అతని ప్రేయసిగా ప్రియాంక జవాల్కర్.. శాస్త్రీయ సంగీత గాయనిగా నిత్యా మీనన్ నటించారు.
ట్రైలర్ ని బట్టి చూస్తే.. నగరంలో కురిసిన భారీ వర్షాల కారణంగా వీరందరి జీవితాల్లో చోటుచేసుకున్న సంఘటనల సమూహారమే 'గమనం' చిత్రమని తెలుస్తోంది. మాస్ట్రో ఇళయరాజా సమకూర్చిన నేపథ్య సంగీతం.. జ్ఞాన శేఖర్ వి.ఎస్. సినిమాటోగ్రఫీ ఈ సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలవనున్నాయి. సుజనా రావు ఈ సినిమాకి దర్శకత్వం వహించారు. ఇప్పటికే ఈ చిత్రం నుంచి విడుదలైన ప్రమోషనల్ కంటెంట్ కు మంచి రెస్పాన్స్ లభించింది. గ్రాండ్ గా నిర్వహించబడిన ప్రీ రిలీజ్ ఈవెంట్ అందరి దృష్టిని ఆకర్షించింది. ఈ క్రమంలో లేటెస్టుగా రిలీజ్ ట్రైలర్ ను వదిలారు.  ఈ ఎమోషనల్ ఫ్యామిలీ డ్రామా శుక్రవారం (డిసెంబర్ 10) ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa