ట్రెండింగ్
Epaper    English    தமிழ்

రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్ పై అలియా భట్ షాకింగ్ కామెంట్స్..?

cinema |  Suryaa Desk  | Published : Sat, Dec 11, 2021, 05:17 PM

అందరు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న పాన్-ఇండియా చిత్రం 'ఆర్ఆర్ఆర్' ఈ సినిమా కోసం ప్రమోషన్‌లు ఇప్పటికే ప్రారంభమయ్యాయి మరియు మేకర్స్, స్టార్  రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్, అలియా భట్, ఇప్పుడుషూటింగ్ స్పాట్ లోని కొన్ని ముచ్చట్లను పంచుకున్నారు.
ఈ చిత్రంతో  తెలుగులో అలియా భట్ అరంగేట్రం చేస్తుంది.  తెలుగు స్టార్స్ రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్ షూటింగ్ జరుగుతున్నపుడు స్పాట్ లో మీతో ఎలా ఉన్నారు అని మీడియా అడిగిన ప్రశ్నకు అలియా ఇలా చెప్పింది.  

ఆ ప్రశ్నను ప్రస్తావిస్తూ, ఇటీవలి ప్రమోషన్‌ కార్యక్రమంలో  ఎన్టీఆర్ మరియు రామ్ చరణ్ - షూట్ సమయంలో ఒకరితో ఒకరు  సరదాగా మాట్లాడుకోనేవారని కానీ నన్ను అసలు పట్టించుకునేవారు కాదని  అలియా తెలిపింది.
నటుడు రామ్ చరణ్, అలియా భట్ మొదట సెట్‌కి వచ్చినప్పుడు, అల్లూరి సీతారామ రాజు పాత్ర కోసం తాను చాలా బిజీగా ఉన్నానని మరియు ఆమెతో మాట్లాడ టానికి  అసలు సమయం దొరకలేదని  తెలిపాడు . హీరోయిన్ గా ఎంతో పేరుగాంచిన అలియా, ఒక పర్ఫెక్ట్ షాట్ ఇవ్వడానికి ప్రయత్నిస్తుందని, రాజమౌళి కి నచ్చేలా షాట్ చెయ్యాలంటే అంత ఈజీ కాదని అందుకే తనను తాను ఆ సమయo లో బిజీగా ఉంచుకుంన్నానని చరణ్ తెలిపాడు.
అయితే జూనియర్ ఎన్టీఆర్ మొదట్లో అలియాతో సరిగ్గా మాట్లాడకపోవడానికి వేరే కారణం ఉంది. మొదట అలియాతో మాట్లాడటానికి అతను చాలా భయపడ్డానని, నా  నటన ఆమెతో సమానంగా చేయగలనా అని నేను కొద్దిగా ఇబ్బంది పడ్డానని ఎన్టీఆర్  తెలిపాడు. జూనియర్ ఎన్టీఆర్ ఇలా అన్నారు, సినిమాలలో అలియా తప్పుపట్టలేని నటనకు మరియు పరిశ్రమలోని కో స్టార్స్ తో  ఆమె ప్రవర్తన  ఆమె నిష్కపటమైన స్వభావానికి జోహార్లు అని ఎన్టీఆర్ ప్రశంసించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa