సినీ నటుడు ఆలీ ఏపీలో ఆన్‌లైన్ టికెట్ల విధానం, బెనిఫిట్ షో వివాదo పై ఆంధ్రప్రదేశ్‌లో ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి గారు సానుకూలంగా ఉన్నారు అని ఈ వివాదానికి త్వరలోనే పరిష్కారం లభిస్తుందని, హామీ కూడా ఇచ్చారని అలీ తెలిపారు. ఆలీ తన సొంత ఊరిలో ఉన్నాడు ఈ సమయంలో కేఎల్‌యూ యూనివర్సిటీ తనకు డాక్టరేట్ ప్రకటించడం ఆనందంగా ఉందని ఆ సభలో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం. ఇప్పటి వరకు తాను 5 భాషల్లో 1124 సినిమాల్లో నటించినట్లు వెల్లడించారు. ఏపీ రాష్ట్రంలో సీఎం జగన్ పరిపాలన అద్భుతంగా ఉందన్నారు. ఏపీలో అన్ని వర్గాలకు వైఎస్ జగన్ సమన్యాయం చేస్తున్నారని ప్రశంసలు కురిపించారు ఆలీ.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa