ట్రెండింగ్
Epaper    English    தமிழ்

హీరోయిన్ గా చేస్తూ.. డాక్టర్ విద్యను పూర్తిచేసిన దర్శకుడు శంకర్ కూతురు

cinema |  Suryaa Desk  | Published : Sat, Dec 11, 2021, 08:59 PM

హీరో కార్తీ 'విరుమాన్' సినిమాతో తమిళ చిత్రాల్లో నటిగా అరంగేట్రం చేస్తున్న ప్రముఖ దర్శకుడు శంకర్ కుమార్తె అదితి శంకర్, తాను ఇప్పుడు అధికారికంగా డాక్టర్ అయినట్లు ప్రకటించింది. గత రాత్రి శ్రీ రామచంద్ర వైద్య కళాశాల స్నాతకోత్సవం నిర్వహించారు. ఈ వేడుకలో తాను డాక్టర్ డిగ్రీని అందుకుంటూ, తండ్రితో డిగ్రీ పట్టుకుని ఉన్న ఫోటోను తన సోషల్ మీడియా ఖాతాలో పోస్ట్ చేసింది. తమిళనాడులోని శ్రీ రామచంద్ర వైద్య కళాశాలలో అదితి వైద్య విద్య అభ్యసించింది.

ఆసక్తికరమైన విషయం ఏమిటంటే.... అదితి ఇప్పుడు అఫిషియల్ గా ఓ డాక్టర్ అయినా.... ఆమె వైద్య వృత్తిలో కొనసాగుతారా లేదా అన్నదానిపై స్పష్టత లేదు. ఎందుకంటే... అదితి శంకర్ సినిమాల్లో అరంగేట్రం చేస్తోంది. కార్తీ హీరోగా ముత్తయ్య దర్శకత్వంలో వస్తున్న 'విరుమాన్' చిత్రంలో అదితినే హీరోయిన్. ఈ సినిమా తర్వాత అదితికి మరిన్ని చాన్సులు వస్తే ఆమె డాక్టర్ వృత్తిని పక్కనబెట్టి, ఫుల్ టైమ్ యాక్టర్ గా మారడం ఖాయం. ఈ ఏడాది సెప్టెంబర్‌లోనే అదితి నటిగా మారనుందని ప్రకటించారు.గతంలో కార్తీ హీరోగా 'కొంబన్‌' చిత్రాన్ని తెరకెక్కించిన ముత్తయ్య ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa