ట్రెండింగ్
Epaper    English    தமிழ்

'భీమ్లా నాయక్' నుంచి 'డానియల్ శేఖర్' న్యూ టీజర్..

cinema |  Suryaa Desk  | Published : Sat, Dec 11, 2021, 10:06 PM

టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రానా దగ్గుబాటి కలిసి నటించిన మొట్ట మొదటి సినిమా భీమ్లా నాయక్ సూర్యదేవర నాగవంశీ నిర్మించిన ఈ సినిమాకి, సాగర్ కె చంద్ర దర్శకత్వం వహించాడు. ఈ సినిమాకి త్రివిక్రమ్ స్క్రీన్ ప్లే .. సంభాషణలు సమకూర్చడం విశేషం. సంగీత దర్శకుడు తమన్ ఎప్పటిలానే మరోసారి తన సత్తా ఏంటో చూపించాడు. ఇద్దరు వ్యక్తుల మధ్య చోటుచేసుకున్న ఇగో .. దాని తాలూకు పరిణామాలే ఈ కథ.
ఇటు పవన్ .. అటు రానా ఇద్దరి పాత్రలు కూడా నువ్వా? నేనా? అన్నట్టుగా ఆవేశంతో నడుస్తాయి. తమదే పైచేయి కావాలనే పట్టుదలతో వాళ్లు పంతాలకు పోతారు. ఇప్పటికి వరకూ వదిలిన అప్ డేట్స్ వలన ఈ విషయం ప్రేక్షకులకు అర్థమైపోయింది. ఈ సినిమా నుంచి ఇంతవరకూ వదిలిన సింగిల్స్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది.
ఈ నెల 14వ తేదీన రానా పుట్టినరోజు .. ఈ సందర్భంగా ఈ సినిమా నుంచి ఆయన కాంబినేషన్ పై కట్ చేసిన స్పెషల్ టీజర్ ను రిలీజ్ చేయనున్నట్టు చెప్పుకుంటున్నారు. ఇక ఈ నెల 20వ తేదీన ఈ సినిమా నుంచి ఒక సాంగ్ ను రిలీజ్ చేయనున్నట్టు తెలుస్తోంది. నిత్యా మీనన్ .. సంయుక్త మీనన్ కథానాయికలుగా కనిపించనున్న ఈ సినిమాలో, సముద్రఖని .. బ్రహ్మానందం .. మురళీశర్మ ముఖ్యమైన పాత్రల్లో కనిపించనున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa